తెలంగాణ

కాంగ్రెస్‌కే ఓటేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల: హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తీర్పుపై రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందని పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం నేరేడుచర్లలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్‌రెడ్డి గృహంలో పలువురు కాంగ్రెస్‌పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ నేడు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించనున్నందున మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నాయకుడు కుందూరు జానారెడ్డి పాల్గొన్న ఈ సమావేశంతోనే ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అవినీతి అధికారానికి, అహకారంపై, నీతి, నిజాయితి, చిత్తశుద్ధికి మధ్య హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోటీ జరుగుతుందన్నారు. రాష్ట్రం మొత్తం హుజూర్‌నగర్ ఎన్నికవైపే చూస్తుందని, ఎన్నికల్లో అధికారపార్టీ పంపిణీ చేసే డబ్బును, మద్యాన్ని తీసుకోని ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలన్నారు. 30వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొన్నవారికి టికెట్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. గతంలో హుజూర్‌నగర్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండేదని నేడు గ్రామగ్రామ ఘర్షణలు, పోలీసుల అక్రమ కేసులతో, వేధింపులతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేరేడుచర్ల మండలంలో రహదారుల అభివృద్ధి పనులు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, తాగునీటి సమస్యలు పరిష్కరించింది తానేనని, ప్రస్తుత పాలకులు తట్టెడు మట్టిని కూడా పోయలేదని విమర్శించారు. డబుల్‌బెడ్‌రూం గృహాలు మంజూరు చేయకపోవడమే కాక నిర్మించిన ఇందిరమ్మ గృహాలకు కూడా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. నేరేడుచర్లలో రహదారి విస్తరణలో పేద ప్రజల నివాస గృహాలు తొలగింపును ఖండిస్తామన్నారు. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఈ ఎన్నిక భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు మార్గదర్శకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పార్టీ గెలుపుతో కేసీఆర్ అహంకారానికి అడ్డుకట్ట వేయడానికి దోహదపడుతుందన్నారు. వివిధ పార్టీలకు చెందిన వారు, తటస్థంగా ఉన్నవారు కాంగ్రెస్‌పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో పాలన కొనసాగడంలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలకంగా పనిచేశామన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం విడిపించామని గుర్తు చేశారు. ఆరు సంవత్సరాల్లో కేవలం 20వేల డబుల్‌బెడ్‌రూంలను మాత్రమే నిర్మించారని, పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌పార్టీనేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన సాగర్ ప్రాజెక్టు వలనే పేద ప్రజలకు ఉపాది లభిస్తుందన్నారు. నిరుద్యోగ భృతి, రుణమాఫి ఊసేలేదని ఆరోపించారు. గతంలో సాయుధపోరాటంలో పోలీసులను ఎదిరించిన సంఘటనను గుర్తు చేసుకోని నేడు ఉద్యమించాలన్నారు. ఉప ఎన్నిక పరిష్కారం కాని ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి హెచ్చరిక కావాలన్నారు. మొదట కాంగ్రెస్‌పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సమావేశంలో సూర్యాపేట, నల్లగొండ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, శంకర్‌నాయక్, పాలకీడు ఎంపీపీ భూక్యా గోపాల్, బెట్టెతండా సర్పంచ్ మోతీలాల్, కాంగ్రెస్ నాయకులు వల్లంశెట్ల లచ్చయ్య, బచ్చలకూరి ప్రకాశ్, రామారావు, కోడిద మనోజ్, రామకృష్ణారెడ్డి, ఉరిమళ్ల రాధాకృష్ణ, బైరెడ్డి జితేందర్‌రెడ్డి, నాగిరెడ్డిలు పాల్గొన్నారు.

*చిత్రం...నేరేడుచర్లలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి