తెలంగాణ

పంచాయతీల ద్వారా గ్రామీణాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: గ్రామీణాభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల ద్వారా అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ‘జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ’ (ఎన్‌ఐఆర్‌డిపీఆర్) లో గురువారం ఏర్పాటు చేసిన ‘సస్టైనబుల్ రూరల్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ త్రూ పంచాయత్స్’ సదస్సులో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయన్నారు. గ్రామీణ స్థానిక సంస్థలు బలంగా ఉండాలని, వాటికి చట్టపరంగా పూర్తి అధికారాలు కట్టబెట్టాల్సి ఉందన్నారు. ప్రజలు తమను తామే పరిపాలించుకోవడం గ్రామ పంచాయతీల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా కొనసాగేందుకు యుతవ ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. గ్రామాభివృద్ధి కోసమే ‘గ్రామోదయా సే భారత్ కా ఉదయ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గవర్నర్ పేర్కొన్నారు. ‘సబ్‌కీ యోజన సబ్ కా వికాస్’ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. 2015 లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘గ్రామ పంచాయత్ అభివృద్ధి ప్రణాళిక’ (జీపీడీపీ) పథకం వినూత్న పథకమన్నారు. కేంద్రం చొరవతో ప్రజలు సొంతంగా తమ తమ గ్రామాల అభివృద్ధికోసం పథకాలను సిద్ధం చేసుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల నాయకులు ఈ పథకం విజయవంతం అయ్యేందుకు చొరవ చూపాల్సి ఉందన్నారు.
14 వ ఆర్థిక కమిషన్ ద్వారా 2,50,000 కోట్ల రూపాయలు ఐదేళ్ల కాలంలో గ్రామీణ స్థానిక సంస్థలకు అందుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. 15 వ ఆర్థిక కమిషన్ కూడా గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నాని అన్నారు. గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ పథకం, జాతీయ గ్రామీణ లైలీహుడ్ మిషన్, పీఎం ఆవాస్ యోజన, పీఎం గ్రామసడక్ యోజన, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, ప్రధాన మంత్రి కల్యాణ్ సమ్మాన్ నిధి తదితర పథకాల ద్వారా గ్రామీణులకు చేయూత ఇస్తోందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన పథకాలను జిల్లాస్థాయి, మండలస్థాయిలలోని స్థానిక సంస్థల నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, జడ్పీపీ సీఈఓలు, మండల అభివృద్ధి అధికారులు ఈ పథకాల అమలుకోసం ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. గ్రామీణాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎన్‌ఆర్‌ఐలను ఎన్‌ఐఆర్‌డీపీఆర్ ప్రోత్సహిస్తోందన్నారు.
వాతావరణ మార్పులపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు రీసోర్స్ పర్సన్స్‌కు ఎన్‌ఐఆర్‌డీపీఆర్ శిక్షణ ఇవ్వడం వల్ల సత్ఫలితాలు వస్తాయని తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రధాన మంత్రి చేస్తున్న ప్రయత్నానికి మనమంతా సహకారం అందించాలని కోరారు.
ఎన్‌ఐఆర్‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యు.ఆర్. రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధికా రస్తోగి, బోధనా, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.