తెలంగాణ

నెలాఖరులోగా చేప పిల్లల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈనెల 30 నాటికి చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా మత్స్య శాఖ అధికారులతో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అధికారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఈ సంవత్సరం 21,756 నీటి వవనరులలో 80.57 కోట్ల చేప పిల్లల విడుదల లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈనెల 16న కాళేశ్వరం ప్రాజెక్టులో చేపపిల్లలు విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు నీటి వనరులలో 19.38 కోట్ల చేప పిల్లలను విడుదల చేశామని తెలిపారు. చేప పిల్లల నాణ్యత, సైజ్, విషయంలో రాజీపడొద్దని, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మత్స్య కారులను భాగస్వాములను చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.