తెలంగాణ

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, సెప్టెంబర్ 19: గత అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురియడంతో కర్నూల్ నుంచి రాయచూరుకు వెళ్లే అంతర్‌రాష్ట్ర రహదారి ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామం వద్ద వాగులు పొంగి ప్రవహించాయ. దీంతో గంటలు తరబడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర చికిత్స నిమిత్తం, అత్యవసర పనుల మీద వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతర్‌రాష్ట్ర రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రద్దీగా ఉండటంతో రోడ్డు మార్గం వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో అంతరాయం తప్పడం లేదు. బొంకూరు గ్రామం వద్ద ఉన్న కాజువేలు బ్రిడ్జీలుగా మార్చేందుకు పనులను చేపడుతున్నారు. పనులు ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో వర్షాలు పడినప్పుడల్లా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి బ్రిడ్జి పనులను త్వరిగతిన పూర్తి చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలంలోని పెద్దపోతుల పాడు, చెన్నుపాడు, అమరవాయి వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. చిన్నపాటి కల్వర్టులను తొలగించి బ్రిడ్జి పనులు చేపడితే తప్ప సమస్య తీరదని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అమరవాయి గ్రామంలో యూపిఎస్ ఉన్నత పాఠశాలలో వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. సంఘటనా స్థలాన్ని స్థానిక అధికారులు పర్యవేక్షించారు. బొంకూరు, అమరవాయి వాగుల వద్ద వాగులు ఉద్ధృతితో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

*చిత్రం...ఉధృతంగా ప్రవహిస్తున్న బొంకూరు వాగు దాటుతున్న స్థానికులు