తెలంగాణ

సాగర్‌లో మూతపడ్డ క్రస్టుగేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 16: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ శ్రీశైలం నుండి వస్తున్న వరద నీరు తగ్గిపోవడంతో సాగర్ డ్యాం క్రస్టు గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటిని పూర్తిగా నిలిపివేశారు. దీంతో సాగర్ డ్యాం క్రస్టు గేట్లు మూతపడ్డాయి. గత నాలుగు రోజులుగా సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో తగ్గుముఖం పడుతుండడంతో ఆదివారం సాయంత్రం నాలుగు గేట్ల ద్వారా మాత్రమే నీటి విడుదల చేసిన అధికారులు సోమవారం తెల్లవారుజాము వరకు క్రస్టు గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 66,4,65 క్యూసెక్కులు వస్తుండగా సాగర్‌లో 589.90 అడుగులుగా ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9,969 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 6,556 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 3,28,19 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుండి 69,8,99 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రస్తుతం 884.30 అడుగులుగా ఉంది.
నిలిచిన టూరిజం లాంచీలు
ఆంధ్రప్రదేశ్ లోని దేవీపట్నం వద్ద ఆదివారం గోదావరి నదిలో పడవ మునిగిపోయిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని నాగార్జునసాగర్‌లో టూరిజం లాంచీలను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీశైలం నుండి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో 2 రోజుల్లో సాగర్ జలాశయంలో టూరిజం లాంచీలను తిప్పుతామని అధికారులు తెలిపారు. సోమవారం నాడు సాగర్ సందర్శనకు వచ్చిన అధికారులు అటు డ్యాం క్రస్టు గేట్లు మూతపడడం, ఇటు లాంచీ ప్రయాణం కూడా లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.

*చిత్రం...క్రస్టు గేట్లు మూసుకుని బోసిపోయిన సాగర్