తెలంగాణ

‘యురేనియం’ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్: కొన్ని రోజుల క్రితం వరకు కేవలం నల్లమలకే పరిమితమైన నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమం నేడు సామాజిక మాధ్యమాలలో సేవ్ నల్లమల పేరుతో జాతీయ స్థాయిలో చేరుకుంది. ఈ యుద్ధం మరింత తీవ్రమైంది. యురేనియం తవ్వకాలతో కేవలం నల్లమల అటవీ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఆదిమజాతి చెంచులకు, వణ్యప్రాణులకు, పర్యావరణంకు, అమూల్యమైన ఔషధమొక్కలకే ముప్పు వాటిల్లనుందని అందరిలో ఒక భావన ఉండేది. పర్యావరణ వేత్తలు, వివిధ రంగాలకు చెందిన మేధావులు, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు నల్లమల ప్రాంతాన్ని సందర్శించి ఉద్యమిస్తున్న వారికి సంఘీభావం తెలుపుతూ యురేనియం తవ్వకాలతో కేవలం పర్యావరణంకేకాక, నల్లమల అడవుల గుండా పారుతున్న కృష్ణాజలాలు కూడా కలుషితమై మూడు రాష్ట్రాల ప్రజలకు పరోక్షంగా ముప్పు వాటిల్లనుందని ముఖ్యంగా కృష్ణాజలాలను ఆధారంగా నిర్మించిన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తాగునీరు అందుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు, తెలుగుగంగ ద్వారా చెన్నై నగరానికి కూడా తాగునీరు అందుతున్న ఈనీరు యురేనియం తవ్వకాలతో కలుషితం కావడంతో వివిధ రకాల వ్యాదులు సంభవించే అవకాశాలు ఉన్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ, క్యాన్సర్‌తోపాటు పుట్టబోయే పిల్లలు మానిసిక వికలాంగులతోపాటు వివిధ రోగాల బారిన పడుతారని చెప్పడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనితో నల్లమల అడవి ప్రాంతంలో ప్రారంభమైన నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమం క్రమేణ మైదాన ప్రాంతాలకు, పట్టణాలనుంచి నగరాలకు పాకుతున్నది.
ఇందులో భాగంగా సేవ్ నల్లమల పేరుతో సామాజిక మాద్యమాలైన ట్విట్టర్, ఫైస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రమ్ తదితర మాద్యమాల ద్వారా పలువురు సెలబ్రేటీలు స్పందిస్తూ ట్విట్ చేస్తుండటంతో జాతీయ స్థాయి ఉద్యమం చేరిందని చెప్పవచ్చు. కేంద్ర , రాష్ట్రాలలో అధికారంలో ఉన్న అధికార పార్టీలు తప్ప మిగతా అన్నీ పార్టీలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామలై వివిధ రూపాలలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు నల్లమల కేంద్రంగా కొనసాగిన ఈ ఉద్యమం ఇకమీదట రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని చేపట్టాలని వామపక్ష పార్టీలతోపాటు ఇతర అన్నీ రాజకీయ పార్టీలు నిర్ణయించుకొని కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు యురేనియం వ్యతిరేక ఉద్యమకారులకు సమాచారం అందుతుంది. మొత్తంమీద యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సెలబ్రేటీలైన వివిధ రంగాలకు చెందిన వారి నుంచి సంపూర్ణ మద్దతు వస్తుండటంతో స్థానిక ఉద్యమకారులు ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇది ఇలా ఉండగా నల్లమలలో యురేనియం నిక్షేపాలకోసం డ్రిల్లింగ్ పాయింట్‌లను గుర్తించేందుకు యుసిఐఎల్ అధికారులు నల్లమల ప్రాంతానికి వస్తున్నారని ప్రచారంతో ఉద్యమకారులు అప్రమత్తమై నల్లమలవైపు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆయా గ్రామాలలో గట్టి నిఘాను పెట్టారు. మొత్తంమీద నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యితిరక ఉద్యమం తీవ్రరూపం దాల్చిందని చెప్పవచ్చు.