తెలంగాణ

ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తున్న సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌లో విద్యారంగాన్ని చిన్న చూపు చూసిందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎస్ మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం నిర్వాకం వల్ల ఉద్యోగులు రెండు పీఆర్‌సీలను కోల్పోయారన్నారు. ఉపాధ్యాయులకు వెంటనే తాత్కాలిక భృతి ప్రకటించాలని, లేదా కొత్తగా పీఆర్‌సీని ప్రకటించాలన్నారు. లేదంటే ఆందోళన చేపడుతామన్నారు. 999 ఉన్నత పాఠశాలల్లో హెడ్ మాస్టర్ పోస్టులు, 449 ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని వెంటనే ప్రభుత్వం భర్తీ చేయాలన్నారు. చాలా ఏళ్లుగా భార్యాభర్తలను ఒకే దగ్గరకు బదిలీ చేయాలని గతంలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా చాలాసమస్యలు ఉన్నాయన్నారు. విద్యాప్రమాణాలు బాగుండాలంటే విద్యా రంగానికి ఇతోధికంగా నిధులు కేటాయించాలన్నారు. రూ.1600 కోట్ల కేటాయిస్తే ఈ శాఖ ఎలా నడుస్తుందన్నారు. ఉపకులపతుల పోస్టులు ఖాళీగా ఉన్నయని, వీటిని భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయులను తయారు చేసే డైట్ కాలేజీల్లో సిబ్బందిలేరన్నారు. పదోన్నతుల విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా నష్టపోతున్నారన్నారు.