తెలంగాణ

‘కాళేశ్వరం’ అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని, ప్రపంచంలోనే ఈ తరహా ప్రాజెక్టు లేదని రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జీ. రాజేశంగౌడ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి అనుబంధంగా ఉన్న ఇతర ప్రాజెక్టు ప్రాంతాలను రాజేశంగౌడ్ నేతృత్వంలో ఒక బృంద గత రెండురోజుల పాటు పర్యటించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 37.08 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. సాగునీటిని అందించడంతో పాటు వందలాది గ్రామాలకు, రాష్ట్ర రాజధానికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించే బహుళార్ధ సాధక ప్రాజెక్టు అన్నారు. రాజేశంగౌడ్‌తో పాటు కమిషన్ సభ్యుడు ఎం. చెన్నయ్య, రంగారెడ్డి జిల్లాప్రజాపరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు కాళేశ్వరం పర్యటనలో పాల్గొన్నారు.