తెలంగాణ

అడవులను రక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలి, సకాలంలో వానలు కురిసేందుకు, మన అన్ని అవసరాలకు తగినంత నీడను అందించే చెట్ల పెంపకాన్ని భారీ ఎత్తున చేపడదామని, ప్రస్తుతం ఉన్న అడవులను కాపాడుకుందామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘అటవీ అమరవీరుల దినోత్సవం’ సందర్భంగా బుధవారం ఇక్కడి నెహ్రూ జంతుప్రదర్శనశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అడవులను కాపాడేందుకు ప్రాణాలను అర్పించిన సిబ్బంది త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. రాజస్థాన్‌లో అడవులు కాపాడటంలో 360 మంది అటవీ సిబ్బంది ప్రాణాలు అర్పించారని, వారి సంస్మరణార్థం ఏటా సెప్టెంబర్ 11 న ‘అటవీ అమరవీరుల దినోత్సవం’ నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. మన రాష్ట్రంలో కూడా 1984 నుండి ఇంత వరకు 21 మంది అటవీ సిబ్బంది డ్యూటీ నిర్వహిస్తూ, ప్రాణాలు కోల్పోయారని, గుర్తు చేశారు. అటవీ సంపదైన చెట్లు, వన్యప్రాణులు ఎంతో విలువైనవని అన్నారు. అడవులను కాపాడటం కోసం పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. అటవీ సంపదను రక్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని మంత్రి అల్లోల్ల తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత ఉండాలన్న ఉద్దేశంతో హరితహారం కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 174 కోట్ల మొక్కలు నాటామన్నారు. పచ్చదనాన్ని 33 శాతానికి తీసుకువెళ్లాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.