తెలంగాణ

బాబు నిర్భంధంపై బక్కని ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: టీడీపీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలీసులు గృహా నిర్భంధం చేయడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి వెళ్ళకుండా పోలీసులు గేటుకు తాళం వేసి నిర్భంధించారని, ఆలా ఎన్ని రోజులు చేయగలరని ఆయన ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలా చేయలేదని ఆయన అన్నారు.