తెలంగాణ

దేశంలో ప్రథమం.. శతశాతం భూ సహిత గ్రామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, సెప్టెంబర్ 11: సభ్యసమాజానికి బహు దూరంగా, అడవితల్లి ఒడినే నమ్ముకుని, ఆ తల్లిఒడి నుండి బయటకు రాక, గుట్ట ప్రాంతంలోని జీవిస్తూ, ఆ ఎత్తు ప్రదేశంలోనే సాగుచేసుకుంటూ, గిరిగీసుకుని బతుకు బళ్ళు లాగుతున్న గిరిజనులకు నిజమైన అభివృద్ధి ఫలాలను అందించడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నుండి విడివడి, నూతన పంచాయతీగా రూపుదిద్దుకున్న వందశాతం గిరిజన ఆవాసమైన ఆకుసాయిపల్లెలో మంత్రి ఈశ్వర్ స్వయం నిర్ణయంతో గ్రామ సందర్శన - సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జూలై 24 నిర్వహించి, వారి సమస్యలు సాంతం విని, పరిష్కారం చేస్తామని ప్రకటించిన క్రమంలో బుధవారం 83మంది గిరిజనులకు 22 ఎకరాల సాగు భూమి పట్టాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ, భూమి లేని కుటుంబం ఆకుసాయిపల్లెలో ఇక లేదని, తద్వారా దేశంలో రికార్డు నెలకొల్పామన్నారు. ఆకుసాయిపల్లె గ్రామానికి తాము ఎన్నికల సమయంలో వచ్చి వెళ్ళామని, వారు ప్రధానంగా మాటకు కట్టుబడి ఉండే నిజాయితీగల జీవులని శ్లాఘించారు. ఇంతకాలం వారికి ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో అందక పోవడం బాధాకరమన్నారు. భూ యాజమాన్యం కల్పించడం ద్వారా రైతు బంధు, బీమా పథకాలకు అర్హులవుతారన్నారు. సంబంధిత మంత్రిగా వారికి సకల సౌకర్యాలు కల్పించే బాధ్యతను స్వీకరిస్తున్నామన్నారు. కూలీలుగా బతుకుతున్న గిరిజనుల పిల్లలు కూలీలు కావొద్దని, వారికి చదువు సంధ్యలతో పాటు ఆర్థిక పరిపుష్ఠికి పథకాలను అమలు చేస్తామన్నారు. నూతన పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్ల వ్యవస్థ భూగర్భ డ్రైనేజీ ద్వారా కల్పిస్తూ, మరొక రికార్డును గ్రామం సొంతం చేసుకునే చర్యలు చేపడుతున్నామన్నారు. జగిత్యాల ఆర్డీఓ డా.నరేందర్, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీలు అరుణ, రాజేందర్, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ రామిల్ల రమేశ్, తెరాస నేతలు భీమయ్య, మల్లేశం, రాజేశ్, రామయ్య, సలీం, కైసర్, మహేశ్, శేఖర్, తహశీల్‌దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ సంధ్యారాణి, సిఐ లక్ష్మీబాబు, ఎస్‌ఐ శ్రీకాంత్, డిటిలు సుమన్, హకీం, రెవెన్యూ సిబ్బంది, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తాండా వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, సర్పంచ్‌ను సన్మానించారు.
చిత్రం...ఆకుసాయిపల్లెలో ప్రసంగిస్తున్న మంత్రి ఈశ్వర్