తెలంగాణ

జియో ట్యాగింగ్ తప్పని సరికాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆయుష్ శాఖలో వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్ చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జియో ట్యాగింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడం తప్పని సరికాదని ఆయుష్ డైరెక్టర్ అలుగు వర్షిణి ఆదివారం సర్కూలర్ జారీ చేసింది. జియో ట్యాగింగ్ వల్ల తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని వైద్య సిబ్బంది ఆందోళన చెందుతోన్న నేపథ్యంలో డైరెక్టర్ వివరణ ఇచ్చారు. వైద్య సిబ్బంది తమ సొంత ఫోన్లలో జియో ట్యాగింగ్ యాప్‌ను ఇన్‌స్టాలేషన్‌కు ఇష్టపడితే చేసుకోవచ్చని లేనిపక్షంలో తప్పని సరికాదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వమే సిబ్బందికి మొబైల్ ఫోన్లను సరఫరా చేస్తుందని, వాటిని అందజేశాకే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు డైరెక్టర్ పేర్కొన్నారు.