తెలంగాణ

మన దేశానికి తిరిగొస్తామనుకోలేదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 25: ‘సౌదీ నుంచి స్వదేశం తిరిగొస్తామనుకోలేదు.. మళ్లీ మనవాళ్లను చూస్తామనుకోలే.. 500 మందికి విముక్తి కల్పించిన ఘనత ‘ఆంధ్రభూమి’కే దక్కుతుంది’ అని భారత్‌ను చేరుకున్న గల్ఫ్ బాధితులు తమ మనసులోని మాటను వెల్లడించారు. సౌదీ నుంచి ఆదివారం స్వదేశం తిరిగొచ్చిన కరీంనగర్, నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఈర్నాల కూనపల్లి మల్లయ్య, పి.సుధాకర్, ఎన్.నర్సింహులు, ఆర్.బలరాం, గంగయ్య, సుదర్శన్, కె.గంగన్న, కె.లింగాగౌడ్, సత్తన్న, తిప్పన్న తదితరులు మాట్లాడుతూ గల్ఫ్‌రిటర్నింగ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్ పాషా తాము సౌదీలో నరకయాతన అనుభవిస్తున్న విషయాన్ని ‘ఆంధ్రభూమి’ దినపత్రిక ద్వారా ఆధారాలతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి తమకు పునర్జన్మ ప్రసాదించారని వెల్లడించారు. బతికుంటే బలుసాకైనా తిని ఉన్న ఊళ్లో కలోగంజో తాగి బతకాలి కానీ పరాయి దేశం వెళ్లొద్దు.. పడరాని పాట్లు పడొద్దు.. తాము అనుభవించిన బాధలు చెప్పనలవి కాదు.. తమలాంటి దుస్థితి ఇక శత్రువుకు కూడా రావద్దంటూ కన్నీళ్లు కారుస్తూ సౌదీలో అనుభవించిన బాధలన్నీ ఒక్కొక్కటిగా వెల్లడించారు. నరకమెలా ఉంటుందో తమకు తెలియదు కానీ సౌదీలో తాము అనుభవించిన నరకం మరెవ్వరూ అనుభవించకుండా ఇక్కడే ఉపాధిమార్గాలు ఎంచుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ బాధితులకు బతుకుజీవనం కోసం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఏదేమైనా తమకు సౌదీ నుంచి విముక్తి కలిగి స్వదేశం తిరిగి రావడం స్వర్గానికి వచ్చినంత సంతోషంగా ఉందంటూ గల్ఫ్ బాధితులు వెల్లడించడం గమనార్హం.
చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న సౌదీ నుంచి స్వదేశం తిరిగొచ్చిన గల్ఫ్ బాధితులు