తెలంగాణ

ఎరువుల కొరత రాదు రైతులు ఆందోళన చెందవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రానికి సరిపడ యూరియాను కేంద్రం కేటాయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన మేరకు 8.50 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. కేంద్రం కేటాయించిన యూరియాతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం 2.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో ఇప్పటి వరకు 3.97 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసిందని తెలిపారు. ఎరువుల కేటాయింపు అనేది కేంద్రం పరిధిలో ఉండే అంశమని మంత్రి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, కృష్ణా పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురియడంతో ఈ సారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దృష్టికి తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న లేఖ రాసినట్టు మంత్రి తెలిపారు. ఎరువుల సమస్య తల్తెకుండా కేంద్ర ఎరువులశాఖ జాయింట్ సెక్రటరీ గుర్విందర్ సింగ్‌కు కూడా శుక్రవారం ఫోన్ చేసి మాట్లాడినట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. కృష్ణపట్నం, వైజాగ్ పోర్టులలో నిలువ చేసిన ఎరువుల ర్యాక్‌లను తెలంగాణకు తరలించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించడంతో రైతులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి కోరారు.