తెలంగాణ

గూడూరు - విజయవాడ మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గుడూరు - విజయవాడ మధ్య కొత్తగా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 25న ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ 12743 -12744 రైలు 25న దేశ ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు గ్రీన్ సిగ్నల్ జెండా ఊపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆరోజు గూడూరులో ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గూడూరు చేరుకుంటుంది. ఈనెల 26వ తేదీ నుంచి ప్రతిరోజూ గూడూరులో ఉదయం 6.10 గంటలకు బయలుదేరి విజయవాడకు 10.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గూడూరు చేరుకుంటుందన్నారు.
సికింద్రాబాద్ - కాకినాడకు ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈనెల 30వ తేదీన సికింద్రాబాద్ నుంచి కాకినాడకు (07053) ప్రత్యేక రైల్‌ను ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 31న కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు ( 07003) బయలుదేరుతుంది.