తెలంగాణ

పోలీసు వ్యవస్థకు దేశ వ్యాప్తంగా మంచిపేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతో పాటు, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు పోలీసు వ్యవస్థ ప్రతిష్టతను పెంపొందిస్తుందని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఆదివారం ఉస్మానియా పోలీస్టేషన్ ఆవరణలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయను తన భార్య వసుంధరతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో గతంతో పోల్చి చూస్తే అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖకు ప్రత్యేక స్థానం కల్పించిందన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నపడే ఆభివృద్ధి సాధ్యమవుతుందని, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నందునే అనేక బహుళ కంపేనీలను స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలంటే వారి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమని అంజనీ కుమార్ తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలు కూడా ప్రయోజకులుగా ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలువలన్నారు. రాష్ట్రంలో కాని, నగరంలో కాని శాంతి భద్రతలు అదుపులో ఉన్నపుడే ఆభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సీపీ అంజనీ కుమార్ దంపతులు ఆత్మీయ సమ్మేళానికి విచ్చేసిన అధికారులు, సిబ్బంది పిల్లలను పలుకరించి ఆత్మీయంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ టి.గోవింద్ రెడ్డి, కాచిగూడ డివిజన్ ఏసీపీ ఎస్.సుధాకర్, ఇన్‌స్పెక్టర్లు ఎల్.రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...చిన్నారులతో ముచ్చటిస్తున్న సీపీ అంజనీ కుమార్