తెలంగాణ

బంధించి..ఏనుగులపై హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: దేవాలయాల్లోనూ, ఇతరత్రా మావటివారి ఆధీనంలో బందీగా ఉన్న ఏనుగులపై ఎక్కువగా శారీరక హింస జరుగుతోందని సీసీఎంబీ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఈమేరకు సీసీఎంబీ ఒక ప్రకటన జారీ చేసింది. కనుమరుగైపోతున్న జీవుల సంరక్షణ విభాగానికి చెందిన ముఖ్య శాస్తవ్రేత్త డాక్టర్ జీ ఉమాపతి నేతృత్వంలోని బృందం నిర్వహించిన పరిశోధనల్లో అనేక అంశాలు వెల్లడయ్యాయి. ఏనుగులు తరతరాలుగా మానవ జీవితంలోనూ, ఆధ్యాత్మిక ఉత్సవాల్లోనూ భాగంగా నిలిచాయి. దేశంలో 20 శాతం మేర ఏనుగులు అడవుల్లో కాకుండా అటవీయేతర ప్రాంతాల్లోనే బందీగా ఉంటున్నాయి. వాటిని పర్యాటకులను ఆకర్షించేందుకో, దేవాలయాల వద్దనో, భక్తులను ఆకట్టుకునేందుకో, సర్కస్ కంపెనీల్లోనో, లేదా యాచనకో ఒక పనిముట్టుగా వినియోగిస్తున్నారు. అయితే ఏనుగులను నిర్వహించే వారిలో ఎక్కువ మందికి ఎలాంటి నైపుణ్యం లేకపోవడం, సంప్రదాయేతర పద్ధతులను అవలంభించడం పరిశోధనలో కనుగొన్నారు.
దాంతో ఏనుగులపై శారీరక హింస పెరుగుతోందని తద్వారా ఏనుగులు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నాయని, ఆ ఒత్తిడితో విచిత్రమైన ప్రవర్తనకు గురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఏనుగుల ఫలదీకరణ కూడా తగ్గిపోతోందని, ఎక్కువ కాలం జీవించాల్సిన జాబితాలో ఉండాల్సిన ఏనుగులు అంతరించిపోయే ముప్పు ఏర్పడుతుందని వారు తెలిపారు. ఒత్తిడికి గురైన ఏనుగులు విచిత్ర ప్రవర్తనతో మనుషుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోందని, అలాంటి ఘటనలు కేరళలో 1989 నుండి 2003 వరకూ చూసుకుంటే 274 జరిగాయని వారు చెప్పారు.
ఏనుగుల ఆరోగ్యం, అలాగే ఏనుగులు బందీగా ఉన్న సమయంలో వాటి ఎడ్రినల్ గ్రంథులు తయారుచేసే హార్మోన్లు, జీవక్రియను సైతం పరిశీలించారు. మైసూర్ జూ, మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఏనుగులు, ఇతర దేవాలయాల్లోని ఏనుగులను పరీక్షించారు. మైసూరు జూలో ఉన్న ఏనుగుల హార్మోన్లు కంటే ఉత్సవాల్లో పాల్గొన్న ఏనుగుల హార్మున్లు తేడాలో ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో ఏనుగులకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదనుకుంటే ఉత్సవాల్లో వాటి వినియోగాన్ని నియంత్రించాలని పరిశోధక బృందం సూచించింది. ఆడ ఏనుగులను అస్సలు ఇలాంటి కార్యక్రమాల్లో వినియోగించరాదని, మగ ఏనుగులను వినియోగించినట్టయితే రోజుకు మూడు నాలుగు గంటలు దాటి వినియోగించరాదని పేర్కొన్నారు. పరిశోధక బృందాన్ని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా అభినందించారు.
డాక్టర్ తంగరాజుకు జేసీ బోస్ అవార్డు
సీసీఎంబీ శాస్తవ్రేత్త డాక్టర్ కే తంగరాజుకు ప్రతిష్టాత్మక జేసీ బోస్ అవార్డు దక్కిందని సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.