తెలంగాణ

బీజేపీ మాటలను జనం నమ్మరు: కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: బీజేపీ నాలుగు లోక్‌సభ సీట్లు గెలిచామనే మిడిసిపాటుతో వ్యవహరిస్తోందని, కేసీఆర్ వైఫల్యాలను ఒక్కరోజైనా నిలదీశారా? అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ధ్వజమెత్తారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారి ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారన్నారు. బీజేపీ పాచికలకు టీఆర్‌ఎస్ ఎంపీలు బంధీలయ్యారన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారిని తమపార్టీలో చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్, బీజేపీలు పోటీపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో నరుూమ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఇంటర్ అవకతవకలపై కేంద్ర సర్కార్ స్పందించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్‌ను విమర్శించడం తగదన్నారు. పీసీసీ సీనియర్ నేత మల్లు రవి మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరు పేదల పాలిట శాపంగా మారిందన్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్ పెడుతున్నారని, ఇప్పటికే అనేక సార్లు ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.