తెలంగాణ

జూరాలకు నిలకడగా వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 16: ఎగువ ప్రాంతంలోని ఆల్మటి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు వస్తున్న వరద నిలకడగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 317.26 మీటర్లు, 7.20 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోగా ఎగువ ప్రాంతం నుంచి జూరాల ప్రాజెక్టుకు 6.85 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 53 గేట్లను తెరిచి 6,60,833 క్యూసెక్కులను, నెట్టెంపాడు ద్వారా 1500, భీమా లిఫ్ట్-1కు 1300, లిఫ్ట్-2కు 1500, కోయిల్‌సాగర్ 630, సమాంతర కాలువకు 850, కుడి, ఎడమ కాలువలకు 2118 క్యూసెక్కులతో కలిపి మొత్తం 6,67,206 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలో 489.42 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ ఉంచుకొని, ఎగువ ప్రాంతం నుంచి 4,59,052 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 4,40,300 క్యూసెక్కులను వదులుతున్నారు. ఆల్మట్టి జలాశయంలో 518.50 మీటర్ల స్థాయిలో 105.12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోగా ఎగువ ప్రాంతం నుంచి 4.70 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 4.34 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.
లక్ష్మీ బ్యారేజీ 55 గేట్ల ఎత్తివేత
మహదేవ్‌పూర్, ఆగస్టు 16: జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) శుక్రవారం 55 గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో బ్యారేజీ సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 93.80 మీటర్ల లెవల్‌లో నీరు ఉండగా 3.142 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 55 గేట్లు ఎత్తివేయడంతో దిగువకు 3 లక్షల 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. లక్ష్మీ బ్యారేజీ ఇన్‌ఫ్లో 3 లక్షల 2 వేల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కనె్నపల్లి వద్ద లక్ష్మీ బ్యారేజీ పంపులను మూసివేశారు. అలాగే సరస్వతీ బ్యారేజీ (అన్నారం) 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుతం 117.300 మీటర్ల లెవల్‌లో 7.20 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ఇఇ రమణారెడ్డి తెలిపారు. బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 900 క్యూసెక్కుల నీరు చేరుకుంటుందని సరస్వతీ బ్యారేజీ గేట్లను మూసివేసినట్టు, అలాగే సరస్వతీ పంపులు కూడా మూసివేసినట్టు ఆయన తెలిపారు.