తెలంగాణ

కుటుంబ పాలన అంతం కావాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటాన్‌చెరు, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణానికి వెళుతూ పటాన్‌చెరులో ఆగిన ఆయనకు పట్టణ శాఖ అధ్వర్యంలో ఘనమైన స్వాగతం లభించింది. అనంతరం స్థానిక అసెంబ్లీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోదీ సంచలనాత్మకమైన నిర్ణయాల కారణంగా భారతావని ప్రజలందరూ బీజేపీ వైపు ఉన్నారన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాడం శుభ పరిణామమన్నారు. ప్రపంచంలోనే 13 కోట్ల మంది సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. పట్టణంలోని ప్రతి బూత్ లోనూ సుమారు వందకు తగ్గకుండా మెంబర్‌షిప్ జరగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యకర్తల నమ్మకం మీద ముందుకు సాగే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీల మాదిరిగా కుటుంబ సభ్యుల పార్టీ ఏమాత్రం కాదన్నారు. గత 70 సంవత్సరాలుగా జరగని మార్పులు కేవలం డెబ్బై రోజులలో ప్రధాని నరేంద్రమోదీ చేసి చూపించారని కొనియాడారు. 370 ఆర్టికల్‌ను తొలగించి ఉగ్రవాదంతో అల్లాడిపోతున్న కాశ్మీర్ ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించిన మోదీ మున్ముందు మరిన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలతో భారతదేశ గతిని మార్చుతారని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, పటాన్‌చెరు శాసనసభ కన్వీనర్ నర్సింగ్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు బాబురాజుగౌడ్, కార్యదర్శి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.