తెలంగాణ

పర్యాటక జన సమ్మోహిత సాగర్ సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 15: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్ల జోరు గురువారం కూడా కొనసాగింది. వరుసగా నాల్గవ రోజు కూడా సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగించగా దిగువన పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ల నుంచి కృష్ణమ్మ సముద్రంలో కలుస్తోంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, 312 టీఎంసీలకుగాను గురువారం రాత్రికల్లా 586.80 టీఎంసీలు, 303.95 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్‌కు నిలకడగా 8లక్షల 80వేల క్యూసెక్కులకు పైగా వరద చేరుతుండటంతో సాగర్ అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు నుంచి 7 లక్షల 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా ఎనిమిది గేట్లను 25 అడుగులు, 18 గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. సాగర్‌కు ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతిని అనుసరించి క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదలను హెచ్చుతగ్గులుగా కొనసాగిస్తున్నప్పటికీ మొత్తం 26 గేట్ల నుంచి నీటి విడుదల సాగుతోంది. సాగర్ నుంచి విడుదలవుతున్న నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కుతుండగా పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటైన మఠంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరద ముంపునకు గురవగా గురువారం గర్భాలయంలో వరద నీరు చేరింది. దీంతో ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలకుగాను 39 టీఎంసీలకు, 177 అడుగులకుగాను 170 అడుగులకు చేరుకోవడంతో ప్రాజెక్టు 24 గేట్లకుగాను 22 గేట్లను ఎత్తి దిగువకు ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల చేస్తున్నారు.
పులిచింతల బ్యాక్ వాటర్ ముంపు పొంచి వున్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్ క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు విడుదలవుతున్న కృష్ణమ్మ జలసోయగాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు స్వాతంత్ర దినోత్సవం, రాఖీ పౌర్ణమి సెలవుల నేపధ్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చారు. సందర్శకుల రద్ధీతో సాగర్ రోడ్లు, డ్యాం ప్రాంతమంతా కిటకిటలాడింది. ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాగర్ ప్రాజెక్టు అన్ని గేట్ల గుండా శుక్రవారం కూడా నీటి విడుదల కొనసాగే పరిస్థితులుండటంతో సందర్శకుల రద్దీ మరింత పెరుగనుంది.