తెలంగాణ

క్రీడల అభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం త్వరలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుందని గురువారం ఇక్కడ తెలిపారు. రాష్ట్ర క్రీడల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు రాణిస్తున్నారని ఆయన అన్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పతాకావిష్కరణ చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అలాగే క్రీడా రంగంలో ముందుందని ఆయన స్పష్టం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నగదు పురస్కారాలను అందిస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు సైతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రీడల్లో హర్యానా, పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్టమ్రే ఉందని ఆయన ప్రకటించారు. త్వరలోనే ఆ రెండు రాష్ట్రాలను సైతం పక్కకు నెట్టేసి నెంబర్ వన్‌గా తెలంగాణ నిలుస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. నేటి యువ క్రీడాకారులు అస్సాంకు చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పరుగుల రాణి కుమారి హిమదాస్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హిమదాస్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని అతిచిన్న వయసులోనే బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుని దేశంలోని యువతకే అదర్శంగా నిలిచిందని తెలిపారు. హిమదాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సత్కరించనున్నట్లు వెల్లడించారు. లక్నోలో జరుగనున్న జాతీయ సీనియర్ అథ్లెటిక్స్‌లో పాల్గొననున్న హిమదాస్‌ను కలిసి అపాయింట్‌మెంట్ తీసుకుని సాట్స్ ఆధ్వర్యంలో ఆమెను సత్కరించనున్న తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగే హిమదాస్ సన్మాన కార్యక్రమంలో ఐదు వేల మంది క్రీడాకారులతో పాటు కోచ్‌లు, క్రీడాధికారులు పాల్గొంటారని చైర్మన్ వెల్లడించారు. ఈ వేడుకల్లో సాట్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ దినకర్ బాబుతో పాటు డిప్యూటీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.