తెలంగాణ

ప్రజల అభీష్టం మేరకే పార్టీని వీడుతున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, ఆగస్టు 15: ప్రజల అభీష్టం మేరకే పార్టీని వీడాల్సి వస్తుందని, బీజేపీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ అంటే తనకు చాలా అభిమానం అని కొంతమంది చేసిన తప్పుల వల్ల పార్టీ దిగజారి పోయిందని పేర్కొన్నారు. మునుగోడు నియోజవర్గం అభివృద్ధి చెందాలంటే తెలంగాణలో బీజేపీ నాయకత్వం అవసరమన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో మునుగోడును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ పూల వెంకటయ్య, నాంపల్లి ఉపసర్పంచ్ ఎస్‌కే.అస్రాబిచాంద్, కాంగ్రెస్ నాయకులు రఘుపతిరెడ్డి, మీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.