తెలంగాణ

బీజేపీ చరిత్రను వక్రీకరించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: కాశ్మీర్ విషయంలో బీజేపీ చరిత్రను వక్రీకరించి అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, మతతత్వశక్తులపై రాజీలేకుండా పోరాడుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ ఆయన గాంధీ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆరెస్సెస్ శక్తులు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పిగొడుతామన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో 22 సార్లు జైలుకు వెళ్లిన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను కించపరుస్తూ బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియగాంధీ తీసుకున్న చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం అవతరణ సాధ్యమైందన్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంతో మంది మహనీయులు పోరాటం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ప్రాణ త్యాగం చేశారని వారు నివాళులు అర్పించారు. సీనియర్ నేత మల్లు రవి మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పాలన వల్లనే పారిశ్రామిక, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందన్నారు. దేశం కోసం 14 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని నెహ్రూ గడిపారన్నారు.
దేశ ప్రజలనుంచి కాంగ్రెస్‌ను విడదీయలేరన్నారు. దేశాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనన్నారు. కాంగ్రెస్ దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిందన్నారు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ ఆ నాటి పరిస్థితులకు అనుగుణంగా 370వ అధికరణను తాత్కాలికంగా ఏర్పాటు చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనంతా నిరంకుశ పాలననే అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

చిత్రం...గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి రాఖీ కడుతున్న కాంగ్రెస్ నాయకురాలు