తెలంగాణ

అలరించిన కళారూపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణ ప్రభుత్వం గురువారం గోల్కొండ కోట వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జాతీయ పతాకం కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. అదే వేదిక నుండి కేసీఆర్ ప్రసంగించారు. రాణిమహల్ ఎదుట ఉన్న కోట గదులపై కళాకారులు నిలబడి ప్రదర్శనలను ఇచ్చారు. కళాకారులు నిలబడేందుకు కిందిభాగంలో స్థలం లేకపోవడంతో కోటపైకి ఎక్కించారు. బోనాలు, బతుకమ్మ, గిరిజనుల నృత్యాలు, పేరిణీ నృత్యం తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు. కళాకారులు ఉదయం ఏడుగంటల నుండి 11 గంటల వరకు కోటగదులపైనే ఉండటంతో వారు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇలా ఉండగా ఈ ఉత్సవంలో పాల్గొన్న పోలీసు దళాలకు సీఎం ఈ సంద్భంగా అవార్డులు అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామెంటేటర్లుగా ఎం. దక్షిణామూర్తి (తెలుగు), ఎస్‌ఎస్‌హెచ్ ఖాద్రి (ఉర్దూ), రేఖారావు (ఇంగ్లీషు) వ్యవహరించారు.
సీపీఐ ఆఫీసులో పతాకావిష్కరణ
సీపీఐ కార్యాలయంలో స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలతో పాటు అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
కార్మిక చట్టాల సవరణ వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ
స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మిక చట్టాల సవరణ వ్యతిరేకిస్తూ ఎఐటీయూసీ నేతలు ప్రతిజ్ఞ చేశారు. యూనియన్ పెట్టుకునే హక్కును, సంప్రదింపుల హక్కును, 8 గంటల పనిదినం హక్కును, వేతన సవరణ కోరే హక్కును కోల్పోయేలా చట్టాలను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని ఎఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీఎస్ బోస్ పేర్కొన్నారు. దేశ సంపదను సృష్టించే కార్మికులపై అవినీతిపరులు, అక్రమార్కులుగా రుద్దుతున్న కార్మిక చట్టాల వ్యతిరేక పొరాటంలో పాల్గొంటామని వారు పేర్కొన్నారు.
జనసేన కార్యాలయంలో ..
హైదరాబాద్: తెలంగాణలోనూ జనసేనను బలోపేతం చేస్తున్నామని పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి శంకర్‌గౌడ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన 73వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయపతాకాన్ని శంకర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత జాతీయ వాదాన్ని, మానవతా వాదాన్ని అలవరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.