తెలంగాణ

సివిల్స్ శిక్షణకు పూర్తయిన అర్హత పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణ రాష్ట్రం నుండి సివిల్స్ పరీక్షలు రాసే ఎస్‌టీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐఏఎస్ స్టడీ సర్కిల్ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ స్టడీ సర్కిల్‌లో గతంలో శిక్షణ పొందిన అభ్యర్థుల్లో చాలా మంది సివిల్స్‌కు ఎంపికయ్యారు. తాజాగా 2019-20 సంవత్సరానికి సివిల్స్ పరీక్షలు రాసేందుకు అభ్యర్థుల ఎంపికకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థులను ఎంపిక చేసే పరీక్షలకు 2241 మంది దరఖాస్తు చేయగా, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 1176 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పిలిచే ఇంటర్వ్యూకు 1:2 చొప్పున ఆహ్వానిస్తామని సంబంధిత శిక్షణా విభాగం డైరెక్టర్ వి. సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.