తెలంగాణ

కేంద్రానికి ఏం చెప్పాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంపై రాష్ట్రంలో విద్యాశాఖ సీనియర్ అధికారులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషీ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించి ఒక నివేదిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పూర్వ విద్య, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖాధికారులను పిలిపించి ప్రతి స్థాయిలోనూ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న విద్యాపథకాలు, వాటి నవీకరణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం, పటిష్ట పరచడానికి సంబంధించిన ఆలోచనలపై అధికారులు దృష్టిసారించాలని ఆయన ఆదేశించారు. నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ముసాయిదాలను రూపొందించాలని చెప్పారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్ధనరెడ్డి, ఇంటర్మీడియట్ విద్య బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, పాఠశాల విద్య సంచాలకుడు విజయకుమార్, విద్యా మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ వీ వెంకటరమణ, ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రాధమిక విద్యకు సంబంధించి అంగన్‌వాడీ కేంద్రాలను వినియోగించుకోవడంతో పాటు అవసరమైన శిక్షణను అందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒకేషనల్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నాణ్యమైన విద్యకు, పరిశోధనలకు చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యారంగానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు తీసుకోవల్సిన వార్షిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి స్కూల్ కాంప్లెక్స్‌లు యూనివర్శిటీలు, కాలేజీల హేతుబద్ధీకరణ, మూడు నెలల నుండి ఆరు ఏళ్ల పిల్లలకు విద్యను అందించడం, ఒకేషనల్ ట్రైనింగ్, పరీక్షల నిర్వహణ, కరిక్యులమ్ ఫెక్సిబిలిటీ, ఉన్నత విద్యలో మల్టీడిసిప్లినరీ సంస్థల ఏర్పాటు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటు, ఉద్యోగావకాశాలను ఆయన చర్చించారు. రాష్ట్రీయ శిక్షా ఆయోగ్, నేషనల్ రీసెర్చి ఫౌండేషన్, లిబరల్ ఎడ్యుకేషన్, అక్రిడిటేషన్ జారీ పద్ధతి, క్యాపబుల్ ఫ్యాకల్టీ, ఎన్‌రోల్‌మెంట్ రేషియో, స్కిల్ డెవలప్‌మెంట్ , స్టేట్ లెవెల్ ప్లాన్, లోక్ విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్, వృత్తివిద్య తదితర అంశాలపై చర్చిస్తూ రాష్ట్ర ప్రాధాన్యతలకు అనుగుణంగా తగిన అబ్జర్వేషన్‌లతో పాటు , సూచనలు, అంగీకారాలు, అభ్యంతరాలు, కొత్త ప్రతిపాదనలతో ముసాయిదా నివేదికలను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన చేయాలని అన్నారు. యూనివర్శిటీలకు పరిశ్రమలతో అనుసంథానం చేయడంతో పాటు పరిశోధనలకు ప్రాధాన్యత ఉండాలని అన్నారు. నిపుణుల కన్సల్టెన్సీ సేవలపై దృష్టి పెట్టాలన్నారు.