తెలంగాణ

బిగ్‌బాస్ ఆపేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: తెలుగులో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. షోను నిలిపి చేయాలని నటి గాయత్రి గుప్తా, యాంకర్ శే్వతారెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. బిగ్‌బాస్ షో పేరిట కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని మండిపడ్డారు. ఇదే విషయంపై తాము తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పిటిషన్ దాఖలు చేసినట్టు వారు వెల్లడించారు. షో ద్వారా అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ బిగ్‌బాస్ షో పేరిట జరిగే సంఘ వ్యతిరేక చర్యలను సినీ హీరో నాగార్జున తెలుసుకోవాలని చెప్పారు. షోకి ఎంపిక చేస్తున్న విధానంలో అన్యాయం జరుగుతోందని యాంకర్ శే్వతారెడ్డి, గాయత్రి ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమానికి తమిళనాడు తెలుగు యువశక్తి నాయకుడు కేతిరెడ్డి జగదీస్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.