తెలంగాణ

గురుకుల విద్యార్థుల వాతావరణ పరిశోధన కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి , ఈసీఐఎల్ సహకారంతో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు వాతావరణ పరిశోధన కార్యక్రమాన్ని చేపట్టారు. టీఐఎఫ్‌ఆర్ ప్రాంగణంలో 15 మంది సభ్యుల గురుకుల విద్యార్థుల బృందం అధిక ఎత్తులో ఎగిరే స్వీరోశాట్-1 బెలూను ప్రయోగించి అందరి మన్ననలు పొందారు. భవిష్యత్‌లో అంతరిక్ష పరిశోధకులు కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విద్యార్థుల బృందం తొలి ప్రయత్నంగా స్వీరోశాట్‌ను ప్రయోగించారు. ఈసందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థుల బృందంలో నిరుపేదలే ఉండటం గమనార్హం. చాలా మంది కార్మికుల పిల్లలు, ఆటో డ్రైవర్‌గా పనిచేసే వారి పిల్లలు, కూరగాయలు అమ్ముకునే వారి పిల్లలు , టీ స్టాల్ నిర్వహించే వారి పిల్లలు ఉండటం విశేషం. 9వ తరగతి చదువుతున్న ప్రసన్న లక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను కలలో కూడా ఇలాంటి ప్రాజెక్టులో పనిచేస్తానని అనుకోలేదని అన్నారు. మరో అమ్మాయి జే దివ్య సైతం సంతోషం వ్యక్తం చేసింది. విద్యార్థులను సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు అభినందించారు.