ఆంధ్రప్రదేశ్‌

డా.చిరంజీవి వైద్యానికి రూ. 5.6 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: అనారోగ్యం పాలైన తొలితరం ఉద్యమనేత, 1969 జై తెలంగాణ ఉద్యమ కారుల సంఘంనాయకుడు, బహుజన ఉద్యమ నేత డాక్టర్ కొల్లూరి చిరంజీవికి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5.6లక్షలు మంజూరు చేసి ఔదార్యాన్ని చాటుకుకున్నారు. ఈ నిధులను సీఎంఆర్‌ఎఫ్ నుండి ప్రత్యేకంగా మంజూరు చేశారు. గత కొంత కాలంగా చిరంజీవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన శ్వాసకోష సంబంధించిన ఆపరేషన్‌ను చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆర్థికంగా ఇబ్బందులను ఎదురుకున్నారు. ఈ పరిస్థితులను గమనించిన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్.రాములు సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకేళ్లారు. అందుకోవాల్సిందిగా లేఖ రాశారు. దీంతో స్పందించిన సీఎం చిరంజీవి ఆపరేషన్‌కు అయిన పూర్తి ఖర్చును సీఎం రీలిఫ్ ఫండ్ నుంచి మంజూరు చేశారు.