ఆంధ్రప్రదేశ్‌

బుల్లెట్ రైలు భలేగుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 28: చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం టియాంజిన్‌నుంచి బీజింగ్ నగరానికి బులెట్ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా చైనాలోని రైలు కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి- విశాఖ, అమరావతి- హైదరాబాద్ మధ్య ఈ బులెట్ రైళ్ళను ప్రవేశపెట్టే అవకాశాలను ఆయన పరిశీలించారు. అలాగే విశాఖ- తిరుపతి మధ్య ఒక బులెట్ రైలును నడపాలని చంద్రబాబు ఆలోచన చేశారు. టియాంజిన్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజింగ్ నగరానికి కేవలం 31 నిముషాల్లో ఈ రైలు చేరుకుంది. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది.
బులెట్ రైలును పరిశీలించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు గుయాన్‌కు బయల్దేరారు. వాస్తవానికి ఆయన విమానంలో బీజింగ్ నుంచి గుయాన్‌కు రావల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడం వలన 7.30 గంటల ఆలస్యంగా ముఖ్యమంత్రి బృందం గుయాన్‌కు చేరుకుంది. గుయాన్‌లో బుధవారం చంద్రబాబు పర్యటన యథాతథంగా జరగనుంది.

చిత్రం... బుల్లెట్ ట్రైన్ వద్ద సిఎం చంద్రబాబు