ఆంధ్రప్రదేశ్‌

ఫీల్డ్ విజిట్‌కెళ్లినా బయో మెట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 28: క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే అధికారులకు ఇకపై బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయనున్నారు. కర్నూలు జిల్లాలో జూలై 1వ తేదీ నుంచి ఈ విధానం అమలుచేయనున్నారు. బయోమెట్రిక్ అమలుతో క్షేత్రస్థాయి పర్యటనల పేర తూతూమంత్రంగా నివేదికలు పంపే అధికారుల్లో దడ మొదలైంది. ఆయాశాఖల అధికారులు క్షేత్రస్థాయి పర్యటన(్ఫల్డ్ విజిట్)కు వెళ్లినపుడు ఆ గ్రామం, పట్టణంలోని ప్రధాన కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ యంత్రంలో వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ విధానం అన్ని శాఖల్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ అందరికీ వర్తింపజేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయి పర్యటనల పేరుతో ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారో తెలియకుండా మసి పూసి మారేడుకాయ చేసే అధికారులకు చెక్ చెప్పినట్లవుతుంది. సాధారణంగా క్షేత్రస్థాయి పర్యటనల్లో అధికారులు స్వయంగా పరిశీలించి తాము గుర్తించిన తప్పు ఒప్పులను నివేదికల్లో పొందుపరచి ఉన్నతాధికారులకు వివరిస్తే సమస్యల పరిష్కారం సులభతరమవుతుంది. అయితే కొందరు అధికారులు ఫోన్ల ద్వారా సమాచారం సేకరించి గ్రామాలకు వెళ్లకుండానే వెళ్లినట్లు రికార్డులు తయారు చేసి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దీని కారణంగా పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సమస్య పరిష్కారంలో బాధితులకు, లబ్ధిదారులకు న్యాయం జరగదన్న అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతోంది. బయోమెట్రిక్ విధానం కారణంగా ప్రతి అధికారి, ఉద్యోగి క్షేత్రస్థాయి పర్యటనకు తప్పనిసరిగా వెళ్లి వేలి ముద్ర వేయడం ద్వారా ఇక ముందు నివేదికల్లో వాస్తవాలు మాత్రమే కనిపిస్తాయని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా జూలై 1 నుంచి తొలివిడతగా 10 ప్రభుత్వశాఖల్లో ఈ ఆఫీస్ విధానం అమలు చేయనున్నారు. ఆ తరువాత 15 నుంచి అన్ని శాఖలకు విస్తరిస్తారు. ఈ ఆఫీస్ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో కాగితాలపై పంపే నివేదికలను పరిశీలించబోనని కలెక్టర్ విజయమోహన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.