తెలంగాణ

త్వరలో బీజేపీలో చేరుతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: త్వరలోనే బీజేపీలో చేరతానని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా చేసిన తప్పుల మూలంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్వనాశనమైపోయిందని అన్నారు. దేశ భవిష్యత్తు, మునుగోడు ప్రజల అభివృద్ధి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అదుపు కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇకమీదట రాష్ట్రం, దేశంలో బీజేపీ హవా కొనసాగుతుంది.. కాంగ్రెస్ మునిగిపోతున్న పార్టీ అని ఆయన చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోగల సత్తా కేవలం బీజేపీకే ఉన్నదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరడం అనేది స్వార్థంతో కాకుండా దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో రెండు మూడుసార్లు సమావేశమయ్యానని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసు గురించి ప్రస్తావించగా.. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వటం ఏమిటి? అధినాయకత్వం మూలంగానే కాంగ్రెస్ ఓడిందని ఆయన ఆరోపించారు. షోకాజ్ నోటీసుకు త్వరలోనే గట్టి సమాధానం ఇస్తాను.. కాంగ్రెస్‌పై తనకు విశ్వాసం పోయిందని ఆయన అన్నారు. బీజేపీలో చేరేందుకు అవసరమైతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ మారుతారా? అని ఒక విలేఖరి ప్రశ్నించగా.. ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయన్నారు. ఆర్థిక కారణాల మూలంగానే మీరు బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని ఒక విలేఖరి అడుగ్గా అలాంటిదేమీ లేదు.. ఆర్థిక కారణాలే అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌లో చేరాలి కదా? అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.