ఆంధ్రప్రదేశ్‌

గోదావరికి వరదొస్తేనే కృష్ణా డెల్టాకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 26: గోదావరికి వరదొస్తేనే కృష్ణా డెల్టాకు సాగు నీరు సాధ్యమవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈ ఏడాది కూడా కృష్ణాకు నీరు అసాధ్యమేనన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనే భావనతో వైపాక నేత జగన్ వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత పదవి పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపాలు, అవినీతికి ఎక్కడికక్కడ ఫుల్‌స్ట్ఫా పెడుతూ తన శాఖ పనిచేస్తోందన్నారు. నీతి నిజాయితీలతో పనిచేసి గత రెండేళ్లలో రూ.14వేల 700 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇందులో అవినీతి జరిగిందటూ తన మీడియాలో అడ్డగోలుగా రాతలు రాయిస్తూ ప్రసారం చేస్తున్నారంటూ జగన్‌పై ఉమ నిప్పులు చెరిగారు. దీన్ని సహించేది లేదని, చట్ట, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దేవినేని ఎంతో మాట్లాడారు.
రాజధాని అమరావతిలో 15కి.మీ పొడవున విస్తరించి ఉన్న కొండవీటి వాగును కొంతమేర కృష్ణానదికి, మరికొంతమేర బకింగ్‌హాం కాలువకు మళ్లిస్తూ ఐదువేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడానికి ఇంజనీర్లు నెల రోజులుగా శ్రమించి సర్వేలు నిర్వహించి నివేదిక సమర్పించారని ఉమ చెప్పారు. దానిపై ఇంకా పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వకపోయినా అందులో వంద కోట్ల మేర అవినీతి జరిగిందంటూ ఆగడం చేస్తున్నారన్నారు.
కడప జిల్లా పులివెందులకు తాగునీటిని తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన గాలేరు-నగరి కాల్వ పనులకు ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యుడు బుగ్గన చంద్రారెడ్డి స్వయంగా అడ్డం పడుతున్నారని, అలాంటి వ్యక్తులకు క్యాబినెట్ హోదా ఉన్న పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని ఆయన విమర్శించారు. ఎటువంటి పరిస్థితుల్లో అవుకు కాలువ ద్వారా ఈ ఆగస్టు నెలలో కడపజిల్లా పులివెందులకు నీరిచ్చేందుకు నీరు అందిస్తామన్నారు.పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని అందరూ కోరుకుంటున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు గుర్తించకపోవడం శోచనీయమన్నారు.