ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధికి ఆటంకం కలగనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగనివ్వబోమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్పష్టంచేశారు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని, ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే లాభనష్టాలపై కేంద్రం అధ్యయనం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ పరిశీలిస్తోందని, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి నష్టం కలగని రీతిలో ఈ అంశంపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం ప్రారంభమైన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల వేదికపై హరిబాబు అధ్యక్షోపన్యాసంచేశారు. ఈసందర్భంగా కేంద్రం రాష్ట్రానికి అందిస్తున్న పలు పథకాలు, ప్రయోజనాలను ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చిన ఘనత బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పలు కేంద్ర విద్యా సంస్థలు నెలకొల్పడంతోపాటు లక్షా 40వేల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులు మంజూరుచేసిన ఘనత బిజెపిదేనన్నారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ద్వారా రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయన్నారు. సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం, వనరులు ఉన్న ఎపి అభివృద్ధికి తిరుగు ఉండదన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్రం, రాష్ట్రం ఒకదానికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినవసరం ఉందన్నారు. కేజి బేసిన్‌లో క్రూడ్ ఆయిల్, ఘననిల్వలు వెలుగులోకి తీసే కార్యక్రమం కేంద్రం చేపట్టబోతోందని, అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పనులు జరుగుతాయన్నారు. పనులు మొదలైతే లక్ష కోట్ల పెట్టుబడులు తరలివస్తాయన్నారు. రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, నిర్మలాసీతారామన్, సుజనా చౌదరితోపాటు రాజ్యసభకు ఎన్నికైన సురేష్‌ప్రభు కేంద్ర కేబినెట్‌లో ఉన్నందున రాష్ట్ర అభివృద్ధికి తిరుగుండదని హరిబాబు పేర్కొన్నారు.
విభజన సందర్భంగా రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అంశంలో ఏడు మండలాల విలీనాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మోసగించిందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఏడు మండలాల విలీనంపై ఆర్డినెన్స్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. 1980లో శంకుస్థాపన జరిగిన పోలవరం ప్రాజెక్టు విషయంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టును నిర్ణీత వ్యవధిలో పూర్తిచేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్ర మంత్రి ఉమాభారతి కూడా హామీ ఇచ్చారన్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు భారతమాత చిత్రపటానికి హరిబాబు, నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు పూలమాలలు వేశారు. అంతకు ముందు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ సిద్ధార్దనాథ్ సింగ్, జాతీయ సంస్థాగత కార్యదర్శి సతీష్‌జీ, ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, సోమువీర్రాజు, రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రులు ఉప్పలపాటి కృష్ణంరాజు, కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడుతున్న హరిబాబు