తెలంగాణ

స్కూల్ బస్సును ఢీకొన్న లారీ, డిసిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 30: ఉదయానే్న ఉత్సాహంగా పాఠశాలకు బయలుదేరిన విద్యార్థులను లారీ, డిసిఎం రూపంలో ఢీకొన్న ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడిన సంఘటన బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివలింగం కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కంది శివారులోని కేశవరెడ్డి పాఠశాలకు చెందిన బస్సు ఉదయం పటాన్‌చెరు ప్రాంతం నుంచి విద్యార్థులను తీసుకొని పాఠశాలకు బయలుదేరింది. ఈ క్రమంలో ఐఐటి ప్రధాన ద్వారం వద్ద జాతీయ రాహదారి 65 పై యూటర్న్ తీసుకుంటున్న బస్సును వెనక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు వేగంగా ముందుకు కదలడంతో సంగారెడ్డి నుంచి పటాన్‌చెరువు వైపు వెళ్తున్న డిసిఎం వాహనం పాఠశాల బస్సును ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డిసిఎం డ్రైవర్ ఖాదర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా రెండు కాళ్లు విరిగి పోయాయి. బస్సులోని సుమారు 35మంది విద్యార్థుల్లో 10మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ సంగారెడ్డిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించి ప్రాథమిక చికిత్సను అందించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రుల వద్దకు పరుగులు తీసి గాయపడిన తమ చిన్నారులను చూసి బోరున విలపించడం అక్కడ ఉన్నవారిని కలిచి వేసింది. ఆనందోత్సవాల మధ్య సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు సమయాత్తమవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడి చల్లని ఆశీస్సుల కారణంగా తమ బిడ్డలు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారని, తాతయ్య తన మనవరాలిని, తల్లి తన బిడ్డను అలింగనం చేసుకొని కన్నీటి భాష్పాలను రాల్చడం ఉద్విజ్ఞనికి గురి చేసింది. పాఠశాల బస్సు డ్రైవర్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.