తెలంగాణ

అందరికీ రీ వాల్యూయేషన్ అవకాశం: ఎస్‌ఎఫ్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఇంటర్ పరీక్షలు రాసిన వారందరికీ ఉచితంగా రీ వాల్యూయేషన్ అవకాశం కల్పించాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డులో నెలకొన్న అనైక్యత, రాజకీయ జోక్యం వల్లనే ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం గ్లోబరీనా అనే సంస్థకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ టెండర్ ఇవ్వడంతో ఆ సంస్థ లోపం వల్లనే ఫలితాలు తారుమారు అయ్యాయని ఆరోపించారు. ఈ సందర్భంగా టీపీఏ రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ ఉచితంగా రీ వాల్యూయేషన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దరఖాస్తు గడువు తేదీని 27 వరకూ కాకుండా మరో పది రోజుల పాటు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. టీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శోభన్ నాయక్, ఎఐఎస్‌బీ రాష్ట్ర కార్యదర్శి వంశీదర్‌రెడ్డి, ఎఐడిఎస్‌ఓ జానా గౌడ్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నాయకులు శోభన్‌బాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ జావేద్, అశోక్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ మోహిద్ పాల్గొన్నారు.

చిత్రం... ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు