తెలంగాణ

పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: కృష్ణా పుష్కరాల కోసం రూ. 771 కోట్ల వ్యయంతో చేపట్టిన 728 పనులను ముమ్మరం చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఆగసుటలో ఈ పుష్కరాలు మొదలయ్యే నాటికి కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండే అవకాశం ఉన్నందున ఘాట్ల పొడవునా బ్యారికేడుల ఏర్పాటుచేసి ప్రమాదాలు జరుగకుండా కట్టుధిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో సోమవారం మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంజి గోపాల్, పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌పి సింగ్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, దేవాదాయశాఖ కమిషనర్ ఎన్ శివశంకర్ తదితర ఉన్నతాధికారులతో రాజీవ్ శర్మ సమావేశమై పుష్కర పనుల నాణ్యతలో రాజీపడకూడదని సూచించారు. పుష్కర ఘాట్లు, రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు, పార్కింగ్ సాటండ్ల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను రాజీవ్ శర్మ అడిగి తెలుసుకున్నారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేకంగా లైటింగ్, మొబైల్ టవర్లు, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, ఘాట్ల వద్ద దీపాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. భక్తులు బట్టలు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో చక్కగా పని చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని, అదే స్ఫూర్తితో కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను రాజీవ్ శర్మ ఆదేశించారు. పుష్కరాలు సమీపిస్తుండటంతో పనుల పురోగతిపై సంబంధిత అధికారులు ఇక నుంచి రెండు వారాలకు ఒకసారి నివేదికలు సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు.