తెలంగాణ

ప్రాజెక్టులు కట్టి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 12: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులను కట్టి తీరుతామని రాష్ట్ర భారీ నీటి పారుదల, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రాజెక్టుల రీడిజైనింగ్ కూడా ఇందుకోసమేనన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆదివారం ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఆధునాతన రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు స్వయంగా పండించి తీసుకువచ్చే కూరగాయల ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధరలు వచ్చేలా, వారికి రవాణా సౌకర్యం కూడా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్, చొప్పదండి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.