తెలంగాణ

యాదాద్రిలో భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జూన్ 12: నల్లగొండ జిల్లా యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మీనృసింహుడికి అనుబంధ శివాలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు కొనసాగాయి. క్షేత్ర సందర్శనకు వచ్చిన యాత్రికులు స్వామికి అర్చనతో పాటు నిత్య కళ్యాణ పర్వాలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పట్టిందని పలువురు భక్తులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పించారు. ప్రసాదాల కొనుగోలుకు భక్తులు బారులు తీరారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అధికంగా కొనసాగాయి. సోమవారం వరకు రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి. కాగా, కొండపైన రెండవ దశ కూల్చివేతలు కొనసాగుతున్నందున వాహనాలను కొండ కింద తులసి కాటేజీ వైపు మళ్లించారు. మరో కొద్దినెలల్లో ప్రధానాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

chitram లక్ష్మీనృసింహుని దర్శనానికి తరలివచ్చిన భక్తులు