తెలంగాణ

షోకాజ్ నోటీసుపై పాల్వాయి కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 12: కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీస్‌పై పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై అభ్యంతర వ్యక్తం చేస్తూ ఆయన పిసిసి చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. జానారెడ్డిని విమర్శించలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన పేర్కొన్నారు. తనను విమర్శించి షబ్బీర్ అలీ, మల్లురవి గీత దాటారని వారిపై కూడా పిసిసి క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుని షోకాజ్ నోటీస్‌లు ఇవ్వాలని పాల్వాయ డిమాండ్ చేశారు. తాజా పరిణామాలను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి నివేదిస్తానన్నారు.