తెలంగాణ

17న వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి, టి.పిసిసి ఎస్‌సి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్‌కు టి.పిసిసి క్రమశిక్షణా సంఘం తాఖీదు పంపించింది. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడినందుకు ఈ నెల 17వ తేదీన గాంధీ భవన్‌కు వచ్చి తమకు వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం. కోదండ రెడ్డి వారిరువురికి శనివారం నోటీసులు జారీ చేశారు. క్రమశిక్షణ తప్పుతున్న ఆపర్టీ నాయకులను శిక్షించేందుకు టి.పిసిసి సమాయత్తమైంది. ఇందులో భాగంగానే ఎంపి పాల్వాయి గోవర్దన్ రెడ్డికి, ఆరేపల్లి మోహన్‌కు నోటీసులు పంపించింది. జానారెడ్డి కోవర్టు అంటూ ఇటీవల పాల్వాయి విమర్శించిన సంగతి తెలిసిందే. కరీంనగర్‌లో జరిగిన ఒక సభలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయంపై ఆరేపల్లి మోహన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఆ జిల్లా నాయకులు ఆరోపించిన నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణా సంఘం ఆయనకు నోటీసు పంపించింది.
ఇలాఉండగా ఇకమీదట గాంధీ భవన్‌లో ఎవరైనా నాయకులు విలేఖరుల సమావేశం నిర్వహించాలనుకుంటే ముందుగా పార్ధ్యీక్షుని అనుమతి తీసుకోవవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు విలేఖరుల సమావేశంల నిర్వహించాలనుకున్నా, తొలుత సిఎల్‌పి నేత కె. జానారెడ్డి లేదా కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అనుమతి పొందాల్సి ఉంటుంది.