తెలంగాణ

కేంద్రం విద్యుత్ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: విద్యుత్ రంగంలో కేంద్రం దోపిడీకి పాల్పడుతోందని, తెలంగాణకు ఎలాంటి సహాయం చేయడం లేదని రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రైవేటు విద్యుత్‌ను యూనిట్‌కు 4.63 రూపాయల నుంచి 5.30 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తోందని తెలిపారు. అదే కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఎన్‌టిపిసి మాత్రం యూనిట్‌కు పది రూపాయలు వసూలు చేస్తోందని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి విద్యుత్ రంగంలో సహాయపడాల్సింది పోయి ఎక్కువ ధర చెల్లించేట్టు చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో అనేక దేశాలు తిరుగుతున్న మోదీ ఇప్పటి వరకు తెలంగాణలో మాత్రం అడుగు పెట్టలేదని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఏర్పడినా, హైకోర్టు విభజనకు మాత్రం కేంద్రానికి సమయం చిక్కడం లేదని విమర్శించారు. రెండేళ్లయినా హైకోర్టును విభజించకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సీలేరు ప్రాజెక్టు రూపంలో బిజెపి ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు. ఏడు మండలాలు ఆంధ్రలో కలిపి సీలేరు ప్రాజెక్టు ఆంధ్రకు పోయేట్టు చేశారని విమర్శించారు. ఆంధ్ర పాలకుల కుట్రకు వంత పాడుతూ సీలేరు రూపంలోనే బిజెపి తెలంగాణపై తొలి దెబ్బవేసిందని అన్నారు.
బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా మాటల్లో నిజం లేదని, తెలంగాణలో బిజెపికి కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు 300 మంది ఐఎఎస్‌లు రావలసి ఉండగా, ఆ ఫైలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దనే పెండింగ్‌లో ఉందని చెప్పారు. కేంద్రంతో సఖ్యతగా ఉండాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అని, కేంద్రం మాత్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని అన్నారు. రాష్ట్రాల పునర్విభజన అనంతరం తెలంగాణకు రావలసిన 53శాతం విద్యుత్ వాటాను ఆంధ్ర పాలకులు ఇవ్వడం లేదని, దీనిపై అమిత్‌షా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణను చీకట్లోకి నెట్టాలనే ఆంధ్ర పాలకుల కుట్రలకు కేంద్రం మద్దతుగా నిలిచిందని అన్నారు. ఈ కుట్రలో భాగంగానే ఖమ్మం నుంచి ఏడు మండలాలను సీలేరు ప్రాజెక్టుతో పాటు ఆంధ్రలో కలిపారని విమర్శించారు. 79 మంది అధికారులతో పాలన సాగిస్తూ తెలంగాణకు రావలసిన అధికారులను కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రికి 12 ఉత్తరాలు రాసిన విషయం నిజం కాదా? అనేది బిజెపి నేతలు చెప్పాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.