తెలంగాణ

భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, జూన్ 11: కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని గంభీరావుపేట మండలం పెద్దమ్మ అడవుల్లో గుట్టుగా సాగుతున్న ఎముకల నూనె తయారీ కేంద్రంపై నాలుగు రోజుల కిందట వరంగల్ జోనల్ ఆహార నియంత్రణ అధికారి ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలోని అధికారులు నిర్వహించిన దాడులు పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎముకల నూనె తయారీ వ్యవహారాన్ని ‘ఆంధ్రభూమి’ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. అయతే, అధికారుల తనిఖీల్లో నిజాలు బహిర్గతమైనా చర్యలు తీసుకోకపోవడంలో అంత్యమేమిటోననే చర్చ సాగుతోంది. వ్యర్థ పదార్థాలు, నూనెను స్వాధీనపర్చుకుని మిన్నకుండిపోయారనే ఆరోపణ వినవస్తోంది. ఎలాంటి అనుమతి లేకుండా ఏ వస్తువును తయారు చేసినా, విక్రయించినా చర్యలకు ఉపక్రమించే అధికారులు భారీ యంత్రాలతో ఎముకల నూనె తయారు చేసిన నిర్వాహకులపై ఎందుకంత ప్రేమ చూపుతున్నారోనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచార వ్యవస్థ బలంగా ఉన్న నేటి రోజుల్లో రూ.35 లక్షల విలువైన యంత్రాలను ఏర్పాటు చేసి ఎముకల నూనె తయారు కేంద్రం సంబంధిత అధికారులకు తెలియకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. చట్టవిరుద్ధ పనులపై కనె్నర్రజేసే ఖాకీలు ‘కామ్’ అయ్యారని పలువురు పేర్కొంటున్నారు. సిరిసిల్ల ఆర్డీవో భిక్షానాయక్ సైతం తయారు కేంద్రంలో రహస్యంగా విచారించడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి అనుమతి పత్రం లేదని నిర్వాహకుల్లో ఒకరు స్పష్టం చేస్తున్నా అదుపులోకి ఎందుకు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అడవుల్లో అధికారులు అంతా గప్‌చుప్ అయ్యారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎముకల నూనె తయారీ ముఠాలో నిజామాబాద్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే, పోలీసు అధికారి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
నెల నెలా మామూళ్లు?
గత ఆరు నెలలుగా సాగుతున్న ఈ దందా సంబంధిత శాఖ అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యేతో స్థానిక ప్రజాప్రతినిధికి ఉన్న సాన్నిహిత్యంతోనే అధికారులు అటువైపు కనె్నత్తి చూడడం లేదని తెలిసింది. సదరు ప్రజాప్రతినిధి ప్రతినెలా సంబంధిత అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు రూ. 5 లక్షల మామూళ్లు ముట్టజెపుతున్నారని వినికిడి.

అడవిలో కొనసాగుతున్న కల్తీ నూనె తయారీ (పాత చిత్రం)