తెలంగాణ

అమిత్ షా ఆటలు ఇక్కడ సాగవు: ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ళలో సాధించింది శూన్యమని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. పైగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. 60 ఏళ్ళలో దేశానికి కాంగ్రెస్ చేసింది ఏమి లేదని అసత్య ప్రచారం చేపట్టారని విమర్శించారు. పదేళ్ళ యుపిఎ ప్రభుత్వ హయాంలో అనేక సంచలనాత్మక, విప్లవాత్మక చట్టాలు తీసుకుని వచ్చి దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించడం జరిగిందని అన్నారు. విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, జాతీయ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం తెచ్చింది యుపిఎ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.