తెలంగాణ

కెయు డిగ్రీ పరీక్షల్లో 28.4 ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట (వరంగల్), జూన్ 11: కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్ష ఫలితాలను ఇన్‌చార్జి ఉపకులపతి చిరంజీవులు విడుదల చేశారు. శనివారం కెయు సెనేట్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మార్చిలో జరిగిన డిగ్రీ వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించారు. ఈ వార్షిక పరీక్షలకు 233984 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, 224638 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ సంవత్సరం కేవలం 28.40 మాత్రమే ఉత్తీర్ణత శాతం ఉందని వివరించారు. ఈసారి పరీక్ష పత్రాల మదింపులో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నందున ఫలితాలు కొంత తక్కువగా వచ్చాయని ఆయన అన్నారు. బిఎ విభాగంలో ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా రెండవ స్థానంలో వరంగల్, మూడవ స్థానంలో ఆదిలాబాద్ నిలిచిందని అన్నారు. అదేవిధంగా బిబి ఎం విభాగంలో వరంగల్ మొదటి స్థానం, ఖమ్మం రెండవ స్థానంలో ఉన్నాయి. బికాం విభాగంలో ఖమ్మం మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో వరంగల్, మూడవ స్థానంలో ఆదిలాబాద్ ఉన్నాయి. బిఎస్సీ విభాగంలో ఖమ్మం మొదటి స్థానంలో అధిక శాతం ఉత్తీర్ణత సాధించగా, వరంగల్ రెండవ స్థానంలో, ఆదిలాబాద్ అత్యల్ప ఉత్తీర్ణత శాతం సాధించాయి. ఈసారి ఫలితాలలో వరంగల్ కంటే కూడా ఖమ్మం జిల్లా ఉత్తీర్ణతా శాతంలో ఎక్కువగా ఉండడం విశేషం. కాకతీయ విశ్వవిద్యాలయ చరిత్రలో ఇంత తక్కువ శాతం ఉత్తీర్ణత రావడం ఇదే మొదటిసారి. శాశ్వత విసి లేకపోవడం, అధికారులు ఎవరికి వారే అన్నట్లు ప్రవర్తించడం, కళాశాలలపై నియంత్రణ లోపించి ఉత్తీర్ణతా శాతం తగ్గడానికి కారణమైందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.