తెలంగాణ

గులాబీ దళపతికి కలిసొచ్చిన కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గులాబీ దళాపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఈ సంవత్సరం బాగా కలిసొచ్చింది. గత సంవత్సరం ఉద్యమం ఫలించి అధికారం చేజిక్కగా వరుస విజయాలతో ఈ సంవత్సరం బాగా కలిసొచ్చింది. సికిందరాబాద్ కంటోనె్మంట్, వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం,శాసన మండలి ఎన్నికలు అన్నింటిలోనూ వరుస విజయాలు. గ్రాడ్యుయేట్ నియోజక వర్గాల్లో హైదరాబాద్‌లో బిజెపికి ఒక్కసీటు విజయం సాధించడం మినహాయిస్తే ఎన్నికలన్నింటిలో టిఆర్‌ఎస్‌దే విజయం.
===============
టిడిపి ఆవిర్భావం తరువాత నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఒక్కసారి కూడా సికిందరాబాద్ కంటోనె్మంట్ బోర్డులో విజయం సాధించలేదు. అలాంటిది పోటీ చేసిన మొదటి సారే టిఆర్‌ఎస్ సికిందరాబాద్ కంటోనె్మంట్‌ను కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావడంతో టిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్, టిడిపిలు తీవ్రస్థాయిలోనే విమర్శలు ప్రారంభించారు. ఇలాంటి వాతావరణంలో జరిగిన వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం ఉప ఎన్నికల్లో మేం గెలిచేస్తాం అని కాంగ్రెస్ ప్రకటించింది. పైకి గెలిచేస్తాం అన్నా టిఆర్‌ఎస్‌కు మెజారిటీ తగ్గుతుంది అనే అంచనా రాజకీయ పక్షాల్లో, మేధావి వర్గంలో బలంగా వినిపించింది. అలాంటిది గత ఎన్నికల్లో లభించిన మెజారిటీ దాటి ఘన విజయం సాధించింది. నాలుగులక్షల 59వేల ఓట్ల మెజారిటీతో దేశంలో మెజారిటీలో ఏడవ స్థానంలో రికార్డు సృష్టించడంతో ప్రధాన రాజకీయ పక్షాలు ఒక్కసారిగా ఢీలా పడ్డాయి. ఆ తరువాత శాసన మండలి ఎన్నికల్లో సైతం ఈ ప్రభావం కనిపించింది. పనె్నండు స్థానాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం రాజకీయ చరిత్ర. ఒకవైపు ఎన్నికల్లో వరుస విజయాలు మరోవైపు ఎమ్మెల్యేలు మొదలుకొని ద్వితీయ శ్రేణి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. చివరకు స్థానిక సంస్థల్లో టిఆర్‌ఎస్ అసలు పోటీ చేయని ఖమ్మం జిల్లాలో సైతం మండలి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ బలంగా తయారైంది. ఈ సంవత్సరం కాంగ్రెస్, టిడిపిలకుచెందిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు టిఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ మొదలుకొని జిల్లాల్లో నాయకులు పెద్ద సంఖ్యలో టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఆవిర్భవించగానే జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించినా నియోజక వర్గాల్లో బలం అంతంత మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీల వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. 18నెలలు గడిచినా నామినేటెడ్ పదవులు రాలేదనో, మంత్రి పదవులు రాలేదనో అసంతృప్తి స్వరాలు వినిపించకుండా విజయవంతంగా ఈ ఏడాదిని ముఖ్యమంత్రిని గడిపేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను ఒక్క వేటుతో తప్పించి కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేయడం ద్వారా పార్టీపై తనకున్న పట్టును చూపించారు. ఈ సంఘటనతో ఏదో అయిపోతుందని భవించిన వారి ఆశలపై నీళ్లుచల్లేవిధంగా కెసిఆర్ పట్టు మరింత బిగిసిపోయింది. వరంగల్ ఎన్నికల మెజారిటీతో ఇక ఎవరూ నోరెత్తని పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల వారే నోరెత్తని పరిస్థితిలో ఇక సొంత పార్టీలో సన్నాయి నొక్కులు కూడా వినిపించని పరిస్థితి. ఈ సంవత్సరం మొత్తం కెసిఆర్‌కు నల్లేరు మీద నడకగానే గడిచిపోయింది. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా వరుస విజయాలే తప్ప ఇబ్బందులు కనిపించలేదు. పలు జాతీయ సంస్థల అవార్డులు లభించాయి. ఈ సంవత్సరం నామినేటెడ్ పదవుల పందేరం ఇదిగో అప్పుడూ ఇప్పుడూ అని గడిపేశారు. ఏడాది చివరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌పై దృష్టిసారించారు. ఎన్నికల ప్రచారం తరహాలోనే హైదరాబాద్‌లో కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఏడాది చివరిలో కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత మహా చండీయాగం తెలంగాణ వారిలోనే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారిలో సైతం మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. కొద్దిమంది వామపక్ష వాదులు విమర్శించినా మాతాభిమానుల అభిమానం సంపాదించుకునేట్టు చేసిందీ యాగం. సొంత ఖర్చుతోనే యాగం నిర్వహిస్తున్నట్టు ప్రకటించడంతో ఖర్చుపై ఆరోపణలకు అవకాశం లేకుండా పోయింది. 18 నెలల పాలనలో, ఏడాది ప్రారంభంలో ఎవరికీ చిక్కకుండా ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అయుత చండీయాగం ద్వారా తన వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ఇచ్చారు. అప్పటి వరకు దూరం పాటించిన వారినికి సైతం ఆహ్వానాలు అందించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తరువాత కెసిఆర్ తొలిసారిగా ఈ సంవత్సరమే విజయవాడలో అడుగు పెట్టారు. యాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, తనను తీవ్రంగా వ్యతిరేకించిన, వ్యతిరేకించిన మీడియాను సైతం ఆహ్వానించి ప్రత్యేకత నిలుపుకున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఉత్సాహం ఎలా ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఇంకా మూడేళ్ల గడువు మాత్రమే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టిఆర్‌ఎస్ నాయకత్వం ఎన్నకల హామీల అమలును వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ఈ కొత్త సంవత్సరంలో గుర్తుంచుకోవాలి.

-బుద్దా మురళి