తెలంగాణ

సిఆర్‌పిఎఫ్ జవాన్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 7: ఛత్తీస్‌గఢ్‌లో మరో సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దంతెవాడ జిల్లా అరణ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపారా సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విధులు నిర్వర్తిస్తున్న వైఎస్ సతీష్ సోమవారం అర్ధరాత్రి తలపై తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఆత్మహత్య చేసుకుంటున్న జవాన్ల సంఖ్య పెరుగుతోంది. కాగా సుక్మా జిల్లా మారాయిగూడెం-గొల్లపల్లి గ్రామాల మధ్య లింగంపల్లి వద్ద పోలీసులు 2 మందుపాతరలను గుర్తించారు. బాంబ్‌స్క్వాడ్‌లు వీటిని సకాలంలో గుర్తించడంతో పెనుముప్పు తప్పింది. ఇక్కడ రహదారి పనులు బందోబస్తుతో చేపట్టగా జేసీబీకి మందుపాతర తగిలి పేలడంతో జేసీబీ డ్రైవర్‌తో సహా జవాన్ చనిపోయిన సంగతి పాఠకులకు విదితమే.