తెలంగాణ

మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6:మిఊన్ కాకతీయ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న పలువురు కాంట్రాక్టర్లపై ప్రభుత్వం వేటు వేసింది. ఆ కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నారు. జిల్లాల్లో మిషన్ కాకతీయ పథకం కింద చెరువును పునరుద్ధరణ పనులు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు కొందరు అగ్రిమెంట్లు చేసుకోవడానికే ముందుకు రావడం లేదు, కొన్ని చోట్ల మందగొడిగా పని చేస్తున్నారు. ఈ వైఖరిపై నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు నల్లగొండ, మెదక్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లను సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్లను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీడియో కాన్ఫరెన్స్‌లలో అలసత్వాన్ని సహించేది లేదని పలు సార్లు హెచ్చరించినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. మిషన్ కాకతీయ మొదటి దశలో భాగంగా సిద్దిపేట డివిజన్‌లో ఎనిమిది చెరువులకు సంబంధించిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. రెండో దశ కింద చేపట్టిన పనుల్లో ముగ్గురిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. నల్లగొండ జిల్లా మిషన్ కాకతీయ రెండవ దశ కింద చేపట్టిన ఆరు పనులకు చెందిన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయిదు రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోని కాంట్రాక్టర్లను వెంటనే సస్పెండ్ చేసి ఎల్1 కోట్ చేసిన రేట్లకే ఎల్ 2కు ఆయా పనులు అప్పగించాలని ఎల్ 2 ఆసక్తి చూపకపోతే ఎల్ 3కి అప్పగించాలని మంత్రి ఆదేశించారు. లేకపోతే టెండర్లు రద్దు చేసి మరోసారి టెండర్లు పిలవాలని చెప్పారు.