ఆంధ్రప్రదేశ్‌

బాపట్లలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు, ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శాఖపరమైన నైపుణ్యతపై శిక్షణ ఇచ్చేందుకు బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్ధను అన్ని హంగులతో తీర్చిదిద్దాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 10లో హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధను చేర్చారు. ఈ సంస్ధను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పది సంవత్సరాలు ఉమ్మడిగా వినియోగించుకోవచ్చు. కాని డాక్టర్ ఎంసిహెచ్‌ఆర్‌డిని తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా తన ఆధీనంలో తెచ్చుకోవడంతో ఏపి ప్రభుత్వం ఇక్కట్లపాలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు హెచ్‌ఆర్‌డి ఇనిస్టిట్యూట్ డైరక్టెర్ జనరల్ డి చక్రపాణి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగులకు అవసరమైన శిక్షణ, పునశ్చరణ తరగతులను నిర్వహించేందుకు బాపట్లలోని కేంద్రం సరిపోతుందని గుర్తించారు. అన్ని హంగులతో, ఉన్నత ప్రమాణాలతో, వౌలిక సదుపాయాలతో మానవ వనరుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చక్రపాణి ప్రణాళికను రూపొందిస్తున్నారు. తొలుత ఈ కేంద్రాన్ని నూజివీడులోని ఐఐఐటి క్యాంపస్‌లో ఏర్పాటు చేసి ఆ తర్వాత బాపట్లకు తరలించారు. ప్రస్తుతం ఈ కేంద్రం వంద ఎకరాల్లో ఉంది. అవసరమైన వౌలిక సదుపాయాలు ఉన్నాయి. ప్రస్తుతం సిఆర్‌డిఏకు ఎంపికైన సిబ్బందికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. దేశంలోని వివిధ రంగాల్లో నిపుణులను బాపట్లకు తీసుకువచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇప్పించేందుకు కూడా ప్రణాళికను ఖరారు చేశారు. సామర్లకోట, శ్రీకాళహస్తిలో ఉన్న సంస్థల్లో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.